అగ్ర హీరోలు.. ఆసక్తికరమైన టైటిల్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం.. పవన్ రీ ఎంట్రీ మూవీ పింక్ రీమేక్ కాగా.. మరో చిత్రం ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం. ఈ మూడు సినిమాలు సెట్స్‌పై శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్నాయి.
చిరంజీవి:
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా దేవదాయ శాఖలో అవినీతిని తెలియజేసే చిత్రం. యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా.. రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ చిత్రానికి `ఆచార్య` అనే టైటిల్ రిజిష్టర్ చేయించినట్లు సమాచారం.
పవన్‌కల్యాణ్:
జనసేనాని పవన్‌కల్యాణ్ రెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా దిల్‌రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ చిత్రం `పింక్`ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వకీల్‌సాబ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు టాక్. మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్:
`బాహుబలి`తో నేషనల్ రేంజ్ హీరో అయిన ప్రభాస్..సాహోతో ఆ రేంజ్ సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు ముందుగా జాన్ అనే టైటిల్‌ను పెట్టాలనుకున్నప్పటికీ.. 96 రీమేక్‌కు జాను అనే టైటిల్‌ను పెట్టడంతో ఇప్పుడు ప్రభాస్ తన సినిమాకు ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments