ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

  • IndiaGlitz, [Monday,February 26 2018]

"జింకను వేటాడేటప్పుడు పులి ఎంత సైలెంట్‌గా ఉంటాది.. మరి అటువంటిది పులినే వేటాడాలంటే మనం ఇంకెంత సైలెంట్‌గా ఉండాలి".. ఈ డైలాగ్ ను ఎన్టీఆర్, త్రివిక్రమ్ చక్కగా పాటిస్తున్నారు. వీరి కలయికలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఓ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పైన చెప్పినట్టు ఈ సినిమా పనులన్నీ చాలా సైలెంట్‌గా కానిస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. స్క్రిప్ట్ విషయం దగ్గర నుంచి ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ వరకు అన్నీ సైలెంట్‌గానే ఉంచుతున్నారు.

ఒక్క విషయం కూడా బయటికి రానీకుండా జాగ్రత్త పడుతున్నారు. పులి లాంటి బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికే ఇప్పుడు సైలెంట్ పాటిస్తున్నారని తెలుస్తోంది. అంతేగాకుండా, మార్చి నుంచి చిత్రీకరణ జరుపుకోబోయే ఈ చిత్రానికి 'ఆన్ సైలెంట్ మోడ్' అనే టైటిల్‌ను నిర్మాత రిజిస్టర్ చేయించారట.

అందుకే కాబోలు మొత్తం పనిని సైలెంట్‌గా చేసేస్తున్నారు. ఇదిలా వుంటే.. ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా బాలీవుడ్ బ్యూటీస్ శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. తమన్ సంగీత దర్శకుడిగా, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక‌య్యారు. ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యతో పాటు..

జీవితకథ ఆధారిత(బయోపిక్) సినిమాలంటే..ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతారు చూడొచ్చు అనుకుంటారు ప్రేక్షకులు.

కాజల్.. మూడో హ్యాట్రిక్

‘లక్ష్మీకళ్యాణం’(2007)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఉత్తరాది భామ కాజల్ అగర్వాల్.

రెండో స్థానంలో చేరిన తమన్

యువ సంగీత సంచలనం తమన్..మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు.

శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది - ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం

శ్రీదేవిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు.నా సూపర్ హిట్ సినిమాల్లో ఎక్కువగా హిందీలో రీమేక్ చేసింది బోణీ కపూర్ గారే.

శ్రీదేవి చనిపోలేదు.. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటుంది - చిరంజీవి

శ్రీదేవి గురించి ఇలాంటి ఒక సందర్భం వస్తుందని అనుకోలేదు.ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నిజంగా నేనెప్పుడూ ఊహించలేదు.