నాగశౌర్య చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నాగశౌర్య కొత్త చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ లిస్టులో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించే సినిమా కూడా ఉంది. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు సంబంధించి `వరుడు కావాలి` అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. రీతూవర్మ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇది కాకుండా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నాగశౌర్య నటిస్తున్నాడు. అనీల్ కృష్ణ దర్శకత్వంలో తన సొంత బ్యానర్లోనే ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.
గత ఏడాది నాగశౌర్యకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే అటు నటుడిగా, ఇటు నిర్మాతగా నాగశౌర్యకు హిట్ లేదు. సమంత టైటిల్ పాత్రలో నటించిన `ఓబేబీ` చిత్రంలో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఫలితం శౌర్యకు కాస్త ఊరటనిచ్చింది. ఇక 2020లో ఏ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో నాగశౌర్య ఆశలన్నీ 2021పైనే ఉన్నాయి. చేస్తున్న నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందనేది తెలియాలంటే వెయిటింగ్ తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com