నాగశౌర్య చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
'ఛలో' విజయం యువ కథానాయకుడు నాగశౌర్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తరువాత తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఈ యంగ్ హీరో. ఈ నేపథ్యంలోనే.. కొత్త దర్శకుడు రాజాతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగశౌర్య. దర్శకుడు ఓ కొత్త పాయింట్‌తో ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేశారనీ.. కథ విన్న వెంటనే ‘సైంధవ’ అనే పేరు ఈ కథకి బాగుంటుందనీ భావించి వెంటనే రిజిస్టర్ చేయించారని సమాచారం.
ప్రతీ పనికి అడ్డుపడే వాడిని 'సైంధవుడి'తో పోల్చడం మామూలే. ఇప్పుడు ఈ టైటిల్‌ను ఫిక్స్ చేయడం బట్టి.. ఈ మూవీలో హీరో పాత్ర ఇదేనని అంతా అనుకుంటున్నారు. కాగా.. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.
ఇదిలా ఉంటే.. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై '@నర్తనశాల' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నాగశౌర్య హీరోగా నటించిన 'కణం', 'అమ్మమ్మగారిల్లు' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments