నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

  • IndiaGlitz, [Monday,April 09 2018]

'ఛలో' విజ‌యం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త‌రువాత త‌దుప‌రి ప్రాజెక్టుల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఈ యంగ్ హీరో.  ఈ నేప‌థ్యంలోనే.. కొత్త దర్శకుడు రాజాతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు నాగశౌర్య. దర్శకుడు ఓ కొత్త పాయింట్‌తో ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేశారనీ.. కథ విన్న వెంటనే ‘సైంధవ’ అనే పేరు ఈ కథకి బాగుంటుందనీ భావించి వెంటనే రిజిస్టర్ చేయించారని సమాచారం.

ప్రతీ పనికి అడ్డుపడే వాడిని 'సైంధవుడి'తో పోల్చడం మామూలే. ఇప్పుడు ఈ టైటిల్‌ను ఫిక్స్ చేయడం బట్టి.. ఈ మూవీలో హీరో పాత్ర ఇదేనని అంతా అనుకుంటున్నారు. కాగా.. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై '@నర్తనశాల' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మ‌రోవైపు నాగశౌర్య హీరోగా నటించిన 'కణం', 'అమ్మమ్మ‌గారిల్లు' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

More News

'కాలా' గురించి 'నా బంగారు తల్లి' ఏమందంటే..

'నా బంగారు తల్లి' సినిమాకుగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న‌ నటి అంజలి పాటిల్. ఆ తర్వాత పలు  హిందీ సినిమాలతో పాటు మరాఠి, ఆంగ్ల చిత్రాల్లోనూ నటిస్తూ వచ్చారు అంజ‌లి.

మెగా హీరోతో మరోసారి

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ త్వరలో ఓ మూవీలో నటించబోతున్న‌ సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అమెరికాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొంటున్న'సాక్ష్యం'

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాక్ష్యం' ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

నా కెరియర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇదే.. ప్రభుదేవా

తన ప్రతి సినిమాతో  విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న కార్తిక్ సుబ్బరాజ్ నిశ్శబ్ధంతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతున్నారు.

'RX 100' జూన్‌లో విడుద‌ల‌!

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ ఎక్క‌డ వినిపించినా గుండెల్లో గుబులు పుట్టించే విల‌న్ గుర్తొస్తాడు. స్కూటీ.. అన‌గానే చ‌లాకీగా న‌వ్వుతూ, చ‌క్క‌గా తుళ్లుతూ తిరిగే అంద‌మైన  అమ్మాయి గుర్తుకొస్తుంది.