షర్మిల కొత్త పార్టీ.. ఆసక్తికర విషయాలివే...

  • IndiaGlitz, [Tuesday,February 09 2021]

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనాన్ని లోటస్‌పాండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ షర్మిల పేరు హోరెత్తుతోంది. లోటస్ పాండ్ దగ్గర ఫుల్ హంగామా నడుస్తోంది. అయిత ఇంత జరుగుతున్నా.. జగన్ సొంత మీడియా ‘సాక్షి’ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. ఏ మాత్రం అస్సలు కవరేజీ లేదు. ఏం జరగనట్టే ఆ మీడియా వ్యవహరిస్తోంది.

మరోవైపు వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ మాత్రం షర్మిలను అక్కున చేర్చుకుంది. గత రెండు వారాలుగా షర్మిల వార్తలను ప్రసారం చేస్తూ హోరెత్తించింది. నేడు షర్మిల సైతం ‘ఏబీఎన్’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. అయితే షర్మిల కొత్త పార్టీకి రూపకర్తగా ఆమె భర్త అనిల్ కుమార్ ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు షర్మిల కొత్త పార్టీకి సంబంధించి పలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ‘తెలంగాణ వైఎస్సార్‌సీపీ’గా షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని సమాచారం. మరోవైపు.. వైఎస్ఆర్, తెలంగాణ ఈ రెండు పేర్లు వచ్చే విధంగానే పార్టీ పేరు నామకరణం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే షర్మిల ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ, వైఎస్ రాజన్న రాజ్యం’ అనే రెండు పేర్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. మొత్తమ్మీద షర్మిల కొత్త పార్టీ ఇటు తెలంగాణలోనూ.. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ షర్మిల పేరు హోరెత్తుతోంది. అయితే ఆమె అభిమానులు మాత్రం లోటస్ పాండ్ దగ్గర ఫుల్ హంగామా చేశారు. షర్మిల వచ్చిన వెంటనే కాగిత పూల వర్షం కురిపించడమే కాకుండా బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు.