'జెర్సీ' లో ఇంట్రస్టింగ్ పాయింట్ ఇదే!
Send us your feedback to audioarticles@vaarta.com
నాని హీరోగా నటించిన `జెర్సీ` ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే నాని చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. తన కెరీర్ బెస్ట్ సినిమా అనీ, తాను చేసిన ఏ పాత్రలో నుంచీ బయటపడటానికి పడని కష్టం `జెర్సీ` కోసం పడ్డాననీ నాని అన్నారు. షూటింగ్ ఆఖరి రోజున నాని ఎలా ఫీలయింది కూడా చెప్పారు. ఇప్పుడు `జెర్సీ` గురించి చెప్పడం శ్రద్ధా శ్రీనాథ్ వంతు.
ఈ సినిమాలో నాని భార్య సారా పాత్రలో నటించింది శ్రద్ధ. ఇందులో ప్రైవేట్ ఎంప్లాయీగా నటిస్తోంది. నాని, శ్రద్ధ మధ్య ఎమోషనల్, హార్ట్ టచింగ్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. నాని ఇందులో క్రికెటర్‌గా ట్రాన్స్ ఫర్మ్ అయ్యే క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ బావుంటాయట. శ్రద్ధ చిన్నతనంలోచాలా చాలానే గల్లీ క్రికెట్ ఆడిందట. క్రికెట్ చూడటమన్నా ఇష్టమేనట. అయితే తను క్రికెట్లో ఎప్పుడూ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం మాత్రం రాలేదట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments