మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘‘కళావతి’’.. మేకింగ్ కోసం అంత ఖర్చా..?
Send us your feedback to audioarticles@vaarta.com
మారుతున్న కాలానికి తగ్గట్టుగా చిత్ర పరిశ్రమలోనూ రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీపరంగానూ, సినిమా తీయడంలోనూ శరవేగంగా మార్పులు వస్తున్నాయి. గతంలో సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, 100 రోజుల ఫంక్షన్లు వుండేవి. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్, సక్సెస్ మీట్ వంటి వేడుకలు వచ్చాయి. అలాగే ప్రమోషన్ కార్యక్రమాలు సైతం మారిపోయాయి. గతంలో పోస్టర్లు, మైకులు, టీవీలు, రేడియోల ద్వారా ప్రచారం చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా రాకతో ప్రమోషన్ సులభమైంది.
ఇటీవలి కాలంలో లిరికల్ సాంగ్స్ హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్‌కు ముందు మ్యుజీషియన్స్ ను, సింగర్స్ ను తీసుకొచ్చి లిరికల్ వీడియోలను స్పెషల్ గా చిత్రీకరించి వదులుతున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ నటించిన 'సర్కారు వారి పాట' సినిమా నుంచి కూడా ‘కళావతి' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సింగర్ సిద్ శ్రీరామ్, తమన్.. కొందరు మ్యుజీషియన్స్ ఆ లిరికల్ సాంగ్‌లో సందడి చేశారు. ఈ పాట ప్రస్తుతం మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
అయితే ఈ పాటకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఫలింనగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే ‘‘కళావతి’’ మేకింగ్ బడ్జెట్ . ఈ పాట కోసం అక్షరాల రూ.60 లక్షల్ని మేకర్స్ ఖర్చు చేశారని టాక్. ప్రమోషన్‌కు బాగా వుపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదట. దాదాపు 1000 మందితో ఈ సాంగ్ షూట్ చేశారు. అయితే ఇంతమంది పడిన కష్టం ఒక్కడి కారణంగా వృథా అయిన సంగతి తెలిసిందే. కళావతి సాంగ్‌ని వాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ.. రెండు రోజుల ముందే మొత్తం పాట నెట్టింట్లో ప్రత్యక్షం కావడంతో చిత్ర యూనిట్ ఉలిక్కిపడింది. చివరికి నిన్న హాడావుడిగా కళావతిని రిలీజ్ చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇకపోతే.. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాటను... మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments