‘సర్కారు వారి పాట’కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్..
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోల్లో ఒకడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆకట్టుకునే కథాంశాలతో వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఈ హీరో నెక్ట్స్ ‘సర్కారు వారి పాట’కు ఫిక్స్ అయ్యాడు. పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఐదు నెలలకు పైగా ఆగిపోయిన షూటింగ్‌లు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టంట్లో హల్చల్ చేస్తోంది. ‘సర్కారు వారి పాట’లో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఒక పాత్రలో బ్రోకర్‌గానూ.. మరో పాత్రలో బ్యాంకు ఆఫీసర్‌గానూ మహేష్ నటిస్తున్నాడనేది సోషల్ మీడియా టాక్. దీనిపై చిత్రబృందం మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. మరి రెండు పాత్రల్లోనూ మహేషే కనిపిస్తాడా? లేదంటే ఒక పాత్ర కోసం మరొకరిని ఎంచుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్ అమెరికాలో షూటింగ్ జరుపుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇక్కడే షూటింగ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com