అఖిల్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ తన రెండో సినిమాను మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నట్టు నాగార్జున ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే...అఖిల్ తొలి చిత్రం విజయం సాధించకపోవడంతో అఖిల్ రెండో సినిమా ఎప్పుడు చేస్తాడా..? ఎప్పుడు సక్సెస్ సాధిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే...ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే....డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక అఖిల్ సరసన నటించే హీరోయిన్ కోసం జెంటిల్ మన్ ఫేమ్ నివేథా థామస్ ను పరిశీలిస్తున్నారు. ఈమెతో పాటు కొత్త హీరోయిన్ అయితే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారని తెలిసింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే...విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఇష్క్, మనం చిత్రాలకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.24 మూవీకి ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఇప్పుడు అఖిల్ మూవీకి కూడా ఎ.ఆర్.రెహమాన్ నే సెలెక్ట్ చేసారని టాక్. డిఓపి - పి.ఎస్.వినోద్, డైలాగ్స్ రైటర్ హర్షవర్ధన్ కన్ ఫర్మ్ చేసినట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com