ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ - సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ఆదిత్య 369. విభిన్న కథాంశంతో రూపొందిన ఆదిత్య 369 ప్రేక్షకాభిమానులు ఆకట్టుకుని తెలుగు నాట మరచిపోలేని చిత్రంగా నిలిచింది. ఇక ఈ సంచలన చిత్రం ఆదిత్య 369 రిలీజై నేటికి సరిగ్గా 25 ఏళ్లు అయ్యింది.
ఈ సందర్భంగా సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్పందిస్తూ...బాలయ్య వందో చిత్రంగా ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 తెరకెక్కాలి. అయితే...అనుకోకుండా గౌతమీపుత్ర శాతకర్ణి తెర పైకి వచ్చింది. అంత మాత్రాన ఆదిత్య 369 సీక్వెల్ ఆగిపోయినట్టు కాదు. బాలయ్య ఎప్పుడు అంటే అప్పుడు తెరకెక్కించడానికి స్టోరీ బోర్డ్ తో సహా అంతా రెడీగా ఉంది. ఈ చిత్రంలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కోసం ఓ పాత్ర రూపొందించిన మాట వాస్తవమే. ఈ చిత్రాన్ని ఎప్పుడు తీసినా కొత్తగా ఉంటుంది. ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని ఇస్తుంది అన్నారు. మరి...బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని...సింగీతం ఆశ త్వరలో నెరవేరుతుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments