అఖిల్ సెకండ్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..

  • IndiaGlitz, [Monday,August 08 2016]

అక్కినేని అఖిల్ సెకండ్ మూవీ అందాల రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అఖిల్ కూడా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో ఇక అంతా ఫిక్స్ షూటింగ్ స్టార్ట్ చేయ‌డం ఒక‌టే ఆల‌స్యం అనుకున్నారు.
ఇంత‌లో...అఖిల్, హ‌ను రాఘ‌వ‌పూడికి నిర్మాత విష‌యంలో డిఫ‌రెన్స్ రావ‌డంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే...లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే....అఖిల్ సెకండ్ మూవీని విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్. మనం సినిమాలో చిన్న పాత్ర‌లోనే అఖిల్ ని అద్భుతంగా చూపించిన విక్ర‌మ్ కుమార్ అఖిల్ కోసం ఇంట్ర‌స్టింగ్ స‌బ్జెక్ట్ రెడీ చేసాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధింది అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ రానున్న‌ట్టు స‌మాచారం.