రెజీనా, నివేద రీమేక్ మూవీ అప్డేట్.. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో!
Send us your feedback to audioarticles@vaarta.com
సురేష్ బాబు అధినేతగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం ఎక్కువగా రీమేక్ చిత్రాలపై ఫోకస్ పెట్టినట్లు ఉంది. కొరియన్ చిత్రాలపై ఇంకాస్త ఎక్కువగానే ద్రుష్టి పెట్టారు. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ ఓ బేబీ లో సమంత నటించగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇటీవల విడుదలైన వెంకీ నారప్ప మూవీ తమిళ సూపర్ హిట్ అసురన్ చిత్రానికి రీమేక్.
ఇదీ చదవండి: నిద్రలోనే తుదిశ్వాస విడిచిన సీనియర్ నటి జయంతి!
తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొరియన్ సూపర్ హిట్ మూవీ 'మిడ్ నైట్ రన్నర్స్'కి ఇది అఫీషియల్ రీమేక్. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.
స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు యువకులు మనుషుల అక్రమ రవాణా గ్యాంగ్ అటకట్టించడమే కథ. యాక్షన్, కామెడీ అంశాలతో మిడ్ నైట్ రన్నర్స్ చిత్రం తెరకెక్కింది. ఒరిజినల్ వర్షన్ లో ఇద్దరు పురుషులు హీరోలుగా నటించారు. కానీ తెలుగు రీమేక్ లో నివేద, రెజీనా లీడ్ రోల్స్ లో నటించనుండడం ఆసక్తిగా మారింది.
బహుశా కథలో మార్పులు చేశారేమో. రెజీనా, నివేదా ఇద్దరూ పెర్ఫామెన్స్ విషయంలో ఫుల్ మార్క్స్ కొట్టేశారు. ఇద్దరూ నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటున్నారు.
రెజీనా తెలుగులో చివరగా ఎవరులో నటించింది నెగిటివ్ షేడ్స్ లో ఆ చిత్రంలో రెజీనా అదరగొట్టేసింది. ఇక నివేదా థామస్ వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి నటిస్తే ఎలా ఉండబోతోందో త్వరలోనే చూడనున్నాం. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. మిక్కీ జె మేయర్ స్వరాలు అందిస్తున్నారు.
Suresh Productions, Guru Films and Kross Pictures - the winning combination of Oh! Baby, are back in collaboration for the official remake of Midnight Runners. The film is being helmed by Sudheer Varma, starring Regina Cassandra and Nivetha Thomas. Shoot in progress ! pic.twitter.com/9SgOBBoITw
— Suresh Productions (@SureshProdns) July 26, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments