చిరు, మోహన్‌బాబు మధ్య ఆసక్తికరమైన సంభాషణ
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ ప్రారంభంలో ఇద్దరూ కలిసి సినిమాలో నటించారు. నాయకుడు, ప్రతినాయకుడు పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిరు డాన్సులు, ఫైట్స్‌కు పెట్టింది పేరైతే.. డిఫరెంట్ డైలాగ్ మేనరిజమ్ మోహన్‌బాబు సొంతం. వీరిద్దరూ కొన్నిరోజుల క్రితం టామ్ అండ్ జెర్రీలాగా జగడమేసుకున్నారు. కానీ కలిసి పోయారు. ఇప్పుడు ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.
తాజాగా ఉగాది సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్స్ చిరంజీవిని ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చినందుకు స్వాగతిస్తున్నారు. ఆ కోవలో మంచు మోహన్‌బాబు కూడా చిరుకు ‘స్వాగతం మిత్రమా’ అని ట్విట్టర్ ద్వారా స్వాగతం తెలిపాడు. దీనికి చిరంజీవి బదులిస్తూ థాంక్యూ మిత్రమా! రాననుకున్నావా.. రాలేననుకున్నావా? అంటూ ఇంద్ర సినిమాలోని ట్వీట్ చేశారు. ప్రతిగా మోహన్‌బాబు తన స్టైల్లో ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతా అంటూ సమాధానం చెబుతూ కన్నుగీటే ఎమోజీని పోస్ట్ చేశారు.
వీరిద్దరి మధ్య సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నెటిజన్స్.. ఎవరూ తగ్గలేదుగా అని అంటే.. మీరు ఇలా సరదాగాఉంటే హ్యాపీగా ఉందంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com