‘‘లైంగిక వేధింపులకు గురయ్యా’’.. సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతని బలవన్మరణం వెనుక కారణాలు తెలిసి సభ్య సమాజం నివ్వెరపోయింది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ గ్రామానికి చెందిన లింగారం లక్ష్మయ్య-సువర్ణ దంపతుల రెండో కుమారుడు వంశీకృష్ణ (17) గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో రాత్రి 10 గంటల వరకు హాస్టల్లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్న వంశీ తర్వాత నిద్రపోయాడు. అయితే శనివారం ఉదయం తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని శవమై కనిపించాడు. దీనిని గమనించిన విద్యార్ధులు ప్రిన్సిపల్‌కు తెలియజేయడంతో.. ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి బ్యాగ్‌లో పోలీసులకు రెండు సూసైడ్ లెటర్స్ లభించాయి. ఒకటి తెలుగులో ఉంది. అందులో.. ‘నేను లైంగికంగా వేధించబడ్డా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని, ఆంగ్లంలో రాసిన మరో లేఖలో ‘బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు కుమారుడి మరణ వార్త తెలుసుకొన్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అతని ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com