ఎస్.. సున్నానే వేస్తారు.. ఇంటర్ బోర్డు కార్యదర్శి బెదిరింపులు!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఇంటర్ మంటలు ఇంకా చల్లారలేదు. ఇటీవలే సప్లిమెంటర్ ఫలితాలు విడుదల చేసిన ఇంటర్ బోర్డు మరోసారి వివాదాస్పదమైంది. విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు సరిగ్గా రాసినప్పటికీ ఫెయిల్ చేశారని విద్యార్థులు ప్రశ్నించారు. ఇందుకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ కుమార్ స్పందిస్తూ ఓవర్ యాక్షన్ చేశారు. 'ఎస్... నేను ఇంటర్ బోర్డు కార్యదర్శిని నాతోనే వాదిస్తారా?.. సున్నా వస్తే అంతే" ఇందులో ఎలాంటి మార్పులుండవ్ అంటూ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ వారిపై మండిపడ్డారు.
అయితే మరోమారు విద్యార్థులు సార్.. మేము సరిగ్గానే పరీక్షలు రాశామని గోడు వినిపించుకోగా.. "సున్నా వేయడం వాళ్ల హక్కు. దీనిపై చర్చ చేస్తారా..? సున్నా వేసిన దాన్ని మేం మార్చలేము. వాల్యూయేషన్ చేసిన మార్కులను మళ్లీ మార్చలేం. అదంతా జరగని పని. పునఃమూల్యాంకనం చేసినా సున్నా వస్తే ఇంకా అంతే... ఫేయిల్ అయినట్లే. నేను ఇంటర్ బోర్డు కార్యదర్శిని నాతోనే వాదిస్తారా. మీ పేర్లు చెప్పండి... ఐడీ కార్డులివ్వండి" అని విద్యార్థులను బెదిరించారు. అయితే ఈ తతంగం మొత్తం ఓ విద్యార్థి తన కెమెరాలో బంధించాడు. దీంతో ఈ వ్యవహారం బహిర్గతమైంది.
అసలే ఇంటర్ బోర్డు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇదిగో ఈ అశోక్ వ్యవహారంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే అధికారులు ఎలాంటి తప్పిదాలైనా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇంటర్ బోర్డు కార్యదర్శి హోదా ఉన్న వ్యక్తులు విద్యార్థులతో ఇలానేనా ప్రవర్తించేది.. పోనీ విద్యార్థులు తమ గోడు వినిపించుకోవడానికి వచ్చారు సరే.. వారికి నచ్చచెప్పి.. అసలు విషయం చెప్పి పంపాల్సింది పోయి ఇలా బెదిరింపులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యాశాఖ అధికారులు, సంబంధిత మంత్రి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments