'పద్మావతి'కి భీమా
Send us your feedback to audioarticles@vaarta.com
దీపికా పదుకొనే టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'పద్మావతి'. సంజయ్ లీలా బన్సాలీ దర్శకుడు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి వివాదాల బాట పట్టింది. సినిమా విడుదలకు దగ్గరయ్యే కొద్ది దేశ వ్యాప్త ఆందోళనలు జరిగాయి.
ఇందులో రాజపుత్ర రాణి పద్మావతిని తప్పుగా చూపించారని వార్తలు రావడం ఈ గొడవలన్నింటికీ కారణం. ఈ వివాదాలను ముందుగా ఊహించాడేమో కానీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. సినిమాపై 140 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించాడట.
భీమా మొత్తంలో 80 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్స్‌కు చెందుతాయి. సినిమా సరిగ్గా ఆడకపోయినా, అల్లర్ల నేపథ్యంలో సినిమా చూడకపోయినా, ఈ భీమా వర్తిస్తుందట. అయితే సినిమాను ప్రభుత్వం నిషేధిస్తే భీమా వర్తించదట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout