సిద్ శ్రీరామ్‌కు పబ్‌లో ఘోర అవమానం!
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ యూత్ గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న సింగర్ సిద్ శ్రీరాం. వైవిద్యమైన గాత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి స్థానం ఏర్పాటు చేసుకున్నారు. సిద్ శ్రీరాంకి విపరీతమైన క్రేజ్ ఉండటంతో దర్శక నిర్మాతలు సైతం తమ సినిమాలో ఆయన చేత ఒక్క పాటైన పాడించుకునేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో సిద్ శ్రీరామ్‌కు టాలీవుడ్‌లో తిరుగులేకుండా పోయింది. వరుస అవకాశాలతో రాణిస్తున్నాడు. అయితే తాజాగా సిద్ శ్రీరాంకు సంబంధించిన ఓ విషయం అభిమానులను కలవరపెడుతోంది.
ఇటీవల ఓ పబ్‌లో సిద్ శ్రీరామ్‌కు ఘోరమైన అవమానం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు సిద్ శ్రీరామ్ వెళ్లగా.. అక్కడ కొందరు ఆకతాయిలు వాటర్ బాటిళ్లు, మద్యాన్ని ఆయన విసిరేసి అవమానించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన శ్రీరాం ఆకతాయిలను బయటకు వెళ్లండంటూ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈ గొడవ జరిగినప్పుడు పబ్‌లో మరికొందరు సెలబ్రిటీలు, ప్రముఖులు ఉండటంతో విషయం పెద్దది కాకుండా పబ్ యాజమాన్యం జాగ్రత్త పడిందట.
అయితే సిద్ శ్రీరామ్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ కూడా సిద్ శ్రీరామ్‌కు జరిగిన అవమానం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ‘క్రమ శిక్షణ ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అన్నింటికంటే క్రమశిక్షణ ముఖ్యం’ అని మార్చి 5న శ్రీరాం ట్వీట్ చేశాడు. పబ్‌లో తనపట్ల అనుచితంగా వ్యవహరించిన ఆకతాయిలను ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్ చేసినట్టుగా సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com