ఇన్‌స్టాగ్రామ్ ‘క్యాప్షన్ వార్నింగ్..’ తస్మాత్ జాగ్రత్త!
Send us your feedback to audioarticles@vaarta.com
టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతోంది.. దాన్ని పనికొచ్చే పనులకు వాడుకోవాల్సింది పోయి.. కొందరు అనవసర పనులకు వాడేస్తున్నారు. అలా వివాదాస్పదమై కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతన్న వాళ్లు దేశ వ్యాప్తంగా కోకొల్లలు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడేయటం.. బెదిరింపులకు పాల్పడటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఫేమస్ అయిపోవవాలనుకోవడం.. ఇలా కొందరు చిల్లర పనులు చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. ఇలాంటి వాళ్లు చేసే పోస్ట్‌ల వల్ల పక్కనుండే వాళ్లు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుంటారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి ఘటనలు పునారవృత్తం కాకూడదని.. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఒక మంచి ఆలోచన చేసింది.
అసలేంటి ఫీచర్!
అక్టోబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ‘రెస్ట్రిక్ట్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది ఇన్‌స్టాగ్రామ్. దీని ద్వారా.. ఇది అసభ్యకరమైన.. నిషేధిక వ్యాఖ్యలతో బెదిరించే వ్యక్తులను ఆపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే బెదిరింపులు పాల్పడే వ్యవహారాలను వీలైనంత తగ్గించాలని భావించిన ఇన్‌స్టాగ్రామ్ ‘క్యాప్షన్ వార్నింగ్’ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా మీ ఫోటోలు లేదా వీడియోల్లో ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో మిమ్మల్ని బెదిరిస్తే అది వెంటనే నోటిఫికేషన్‌తో ఫ్లాగ్ చేయబడుతుంది. ఈ క్యాప్షన్ నివేదించబడిన ఇతరులతో సమానంగా కనిపిస్తుంది. మెసేజ్‌ను సవరించడానికి లేదా షేర్ చేయడానికి వినియోగదారునికి ఒక ఎంపిక ఇవ్వబడుతుంది.
18 ఏళ్లలోపు వారు చూడకుండా!
సీ కామెంట్ (కామెంట్ చూడండి) అనే నొక్కడం ద్వారా.. మీరు చేసిన కామెంట్స్‌ను వ్యాఖ్యను చూడటానికి ఉపయోగపడుతంది. చూసిన తర్వా తొలగించవచ్చు లేదా విస్మరించవచ్చు. ప్రత్యక్ష సందేశాలు స్వయంచాలకంగా సందేశ అభ్యర్థనకు తరలిపోతాయి. అంతేకాదు.. వినియోగదారులు పరిమితం చేయబడిన ఖాతా నుంచి నోటిఫికేషన్‌లను స్వీకరించరు. కామెంట్స్, ఫోటోలు, వీడియోల్లో బెదిరింపు మరియు ఇతర రకాల హానికరమైన విషయాలను గుర్తించడానికి ఇన్‌స్టాగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని ఉపయోగిస్తోంది. కొన్ని కొన్ని పోస్ట్‌లను 18 ఏళ్లలోపు వారు చూడకుండా పరిమితం చేస్తామని కంపెనీ ప్రకటించింది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం మా బాధ్యత’ అని సంబంధిత హెడ్ ఆడమ్ మొస్సేరి ఓ ప్రకటనలో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout