'ఇంకొక్కడు' రిలీజ్ డేట్ మారింది....
Send us your feedback to audioarticles@vaarta.com
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం `ఇరుముగన్`.
ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి `ఇంకొక్కడు` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తమిళంలో సెప్టెంబర్ 2న విడుదల చేస్తామని అనుకున్నారు. తెలుగులో మాత్రం సెప్టెంబర్ 2న విడుదలయ్యే అవకాశం లేదని అనుకున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం తమిళ నిర్మాత శిబు తమీన్స్ సినిమా తమిళ వెర్షన్ ను సెప్టెంబర్ 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. తెలుగు, తమిళంలో సినిమాను ఒకేసారి విడుదల చేయాలనుకోవడమే అందుకు కారణమని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com