ఆగస్ట్ 15న విక్రమ్ ఇంకొక్కడు ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం `ఇరుముగన్`. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి `ఇంకొక్కడు` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆగస్ట్ 15న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా....
నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ``చియాన్ విక్రమ్ హీరోగా, గ్లామర్ క్వీన్స్ నయనతార, నిత్యామీనన్‌లు నటించిన చిత్రం ఇంకొక్కడు. శిబుథమీన్స్ గారు, ఆనంద్ శంకర్ గారు కాంబినేషన్ లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది. స్టార్ నటీనటులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జైరాజ్, సినిమాటోగ్రాఫర్ గా ఆర్.రాజశేఖర్, ఎడిటర్ గా భువన్ శ్రీనివాస్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇటీవల తమిళంలో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రతి సినిమాలో ఏదో ఒక విలక్షణతను చూపే చియాన్ విక్రమ్ గారు ఈ చిత్రంలో హీరోగానే కాకుండా, హిజ్రా గెటప్‌లో కూడా అలరిస్తున్నారు. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మేకింగ్ వాల్యూస్‌కు, విక్రమ్ స్టయిల్, గెటప్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌కు దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ భారీ బడ్జెట్ చిత్ర ఆడియో వేడుకను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీల సమక్షంలో జె.ఆర్.సి. కన్వెక్షన్ సెంటర్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com