ఆగ‌స్ట్ 15న విక్ర‌మ్ ఇంకొక్క‌డు ఆడియో

  • IndiaGlitz, [Thursday,August 11 2016]

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఇంకొక్కడు'. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం 'ఇరుముగన్'. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి 'ఇంకొక్కడు' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఆగ‌స్ట్ 15న హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా....

నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ''చియాన్ విక్ర‌మ్ హీరోగా, గ్లామ‌ర్ క్వీన్స్ న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్‌లు న‌టించిన చిత్రం ఇంకొక్క‌డు. శిబుథమీన్స్ గారు, ఆనంద్ శంకర్ గారు కాంబినేషన్ లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది. స్టార్ న‌టీన‌టుల‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జైరాజ్, సినిమాటోగ్రాఫర్ గా ఆర్.రాజశేఖర్, ఎడిటర్ గా భువన్ శ్రీనివాస్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇటీవ‌ల త‌మిళంలో విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌, పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌తి సినిమాలో ఏదో ఒక విల‌క్ష‌ణ‌త‌ను చూపే చియాన్ విక్ర‌మ్ గారు ఈ చిత్రంలో హీరోగానే కాకుండా, హిజ్రా గెట‌ప్‌లో కూడా అల‌రిస్తున్నారు. సినిమా ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమా మేకింగ్ వాల్యూస్‌కు, విక్ర‌మ్ స్ట‌యిల్‌, గెట‌ప్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్‌కు దాదాపు 5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకే ఈ భారీ బ‌డ్జెట్ చిత్ర ఆడియో వేడుక‌ను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న టాలీవుడ్‌కు చెందిన సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో జె.ఆర్‌.సి. క‌న్వెక్ష‌న్ సెంట‌ర్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హిస్తున్నాం'' అన్నారు.

More News

చిరు 150వ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

గెస్ట్ రోల్ గురించి క్లారిటీ ఇచ్చిన అఖిల్..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటిస్తున్న చిత్రం ఆటాడుకుందాం...రా. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నితిన్ నెక్ట్స్ మూవీ ఫిక్స్..

యువ హీరో నితిన్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన అ ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి నితిన్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి మ్యూజిక్ అందించేది ఇత‌నే..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు క్రిష్ పెళ్లి కార‌ణం బ్రేక్ ప‌డిన షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

సునిల్ కెరీర్లోనే పెద్ద కమర్షియల్ సక్సస్ ని అందించిన ప్రేక్షక దేవళ్ళకి మా ధన్యవాదాలు : నిర్మాత ఆర్ . సుదర్శన్ రెడ్డి

సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా జంటగా, ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా.. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందించిన జక్కన్న చిత్రం జులై 29న విడుదలయ్యింది.