మంచి సినిమా.. అన్యాయం అయిపోతోంది
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్న సినిమాను పెద్ద సినిమా తొక్కేస్తుందంటారు. కానీ ఒక్కోసారి చిన్న సినిమాకు మరో చిన్న సినిమానే పోటీగా కూర్చుంటుంది. గంపగుత్తగా ఒకేసారి ఓ 10 సినిమాలొస్తే, అందులో ఓ మంచి సినిమాకు కచ్చితంగా అన్యాయం జరుగుతుంది. ఈ వీకెండ్ రిలీజైన సినిమాల్లో అలాంటి అన్యాయం 'A' అనే మూవీకి జరిగింది.
సినిమాలో కంటెంట్ ఎంత ముఖ్యమో.. ఆ సినిమా రిలీజ్ కు టైమింగ్ కూడా అంతే ముఖ్యం. సరైన టైమ్ లో పడితే సినిమాకు రీచ్ బాగుంటుంది. అదే ఓ 10 సినిమాల మధ్య పడితే, ఇది కూడా అందులో కొట్టుకుపోతుంది. 'A' అనే మూవీతో జరిగిన అలాంటి ఓ మంచి ప్రయత్నం, బాక్సాఫీస్ లో కలిసిపోయింది.
ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్స్ పెద్దగా ఎవ్వరికీ తెలియదు. యుగంధర్ రెడ్డి అనే వ్యక్తి న్యూయార్క్ నుంచి వచ్చి, తన సొంత డబ్బుతో ఈ సినిమా తీశాడు. దీనికి డైరక్టర్ కూడా అతడే. చాలామంది ఇలా వచ్చి, సినిమాలు తీసినోళ్లు ఉన్నారు. కానీ 'A' మూవీలో విషయం ఉంది. ఇదొక కొత్త కాన్సెప్ట్.
ఇందులో హీరోపై ఓ రసాయన ప్రయోగం జరుగుతుంది. దాంతో అతడి వయసు ఆగిపోతుంది. అందరూ పెరిగి పెద్దవుతారు. హీరో మాత్రం 40 ఏళ్లుగా యువకుడిగానే ఉండిపోతాడు. ఈ కాన్సెప్ట్ కు చిన్న థ్రిల్లర్ ఎలిమెంట్ తో పాటు, ఇందిరాగాంధీ హయాంలో వచ్చిన ఎమర్జెన్సీ యాంగిల్ ను కూడా జోడించి నీట్ గా సినిమా తీశారు.
అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ, ఈ సినిమాకు టైమింగ్ కలిసిరాలేదు. దీంతో పాటు ఎకాఎకిన 10 సినిమాలు ఒకేసారి థియేర్లలోకి రావడంతో 'A' మూవీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మంచి సినిమాకు మౌత్ టాక్ కూడా లేకుండా పోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com