ఇంద్రసేన ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ ఆంథోని తాజాగా నటిస్తొన్న చిత్రం "ఇంద్రసేన". ఎన్.కె.ఆర్ ఫిలింస్ , ఆర్,స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరెషన్ పతాకంపై కృష్ణారెడ్డి , రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని
ఇంద్రసేన ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.శ్రీనివాసన్ దర్శకుడు. మదర్ సెంటిమెంట్ తో బిచ్చగాడు గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ ఆంథోని.. ఈసారి బ్రదర్ సెంటిమెంట్ తో ఇంద్రసేన గా వస్తున్నాడు. ఇప్పటికె ట్రైలర్ తో సెన్సెషన్ క్రియేట్ చెసిన ఇంద్రసేన నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ఆడియో ను రాజశేఖర్, జీవిత ఆవిష్కరించారు.. సినీ మ్యాక్స్ లొ జరిగిన ఈ ఆడియో వేడుకలొ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్.కె.ఆర్ ఫిలింస్ అధినేత, నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మా బ్యానర్ లొ ఇంద్రసేన హ్యాట్రిక్ హిట్ గా నిలుస్తుంది. విజయ్ ఆంథోని గారు మా బ్యానర్ పై, నాపై నమ్మకంతో ఇంద్రసేన ను తెలుగులో విడుదల చెసెందుకు అవకాశమిచ్చారు. నవంబర్ 30న సినిమాను విడుదల చెస్తున్నామన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బిచ్చగాడు సినిమాను 40 లక్షలకు కొంటే అది 30కొట్ల వసూళ్లను సాధించింది. 50 థియెటర్స్ లొ విడుదలైన ఈ సినిమా దినదిన ప్రవర్దమానంగా ఆడింది. ఓ మంచి సినిమాను ఆడియోన్స్ ఏ స్దాయికి తీసుకువెళతారనెది దానికి బిచ్చగాడు సినిమానె ఉదాహరణ. ఇంద్రసేన కూడా ఆ స్దాయి విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నానన్నారు..
రాధిక మాట్లాడుతూ.. తెలుగు సినిమా స్దాయి ఎంతో గొప్పది. మంచి సినిమాలకు ఇక్కడ ఎల్లప్పుడు ఆదరణ ఉంటుంది. ఇంద్రసేన అందరికి నచ్చుతుంది. స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఇది. పాజిటివ్ నెస్ ఉంటుంది. మా సినిమాకు సపోర్ట్ చెసిన చిరంజీవిగారు, జీవితా రాజశేఖర్, రవితేజ కు దన్యవాదాలన్నారు.
రాజశేఖర్ మాట్లాడుతూ.. రాధికా గారంటే మాకు గౌరవం, భయం. విజయ్ ఆంథోని "బిచ్చగాడు " ను నేను తెలుగులో చెయాల్సిన సినిమా. మిస్సయింది. అందులొ అమ్మ పాట అద్బుతం. అమ్మ కు ఎంత విలువ ఇవ్వాలొ చెప్పిన చిత్రం బిచ్చగాడు. ఇంద్రసేన ట్రైలర్ బాగుంది. విజయ్ ఆంథోని కంటే ఆయన క్యారెక్టర్ మాత్రమే కన్పిస్తుంది. సినిమా హిట్ కావాలని, బాగా మనీ రావాలని కొరుకుంటున్నాను.
జీవిత మాట్లాడుతూ.. విజయ్ ఆంథోని సినిమాను ప్రేమించె వ్యక్తి. క్యాలిటీ గా ఈ సినిమాను చేశారు.ఇంద్రసేన గా ఆయన మరో హిట్ ఇవ్వాలన్నారు.
హీరొయిన్స్ డైనా,మహిమ మాట్లాడుతూ.. ఇంద్రసేన లో అవకాశం రావటం సంతోషం. సినిమా అందరినీ అలరిస్తుందన్నారు.
హేమచంద్ర మాట్లాడుతూ.. విజయ్ ఆంథోని గారితొ బిచ్చగాడు నుంచి ఆయనతో ట్రావెల్ చెస్తున్నాను. సినిమా అయినా, వర్క్ అయినా ఎంతో డెడికెషన్. భాష్య శ్రీ రచన ఈ సినిమాకు ఓ బలమన్నారు..
భాష్య శ్రీ మాట్లాడుతూ.. విజయ్ గారి సినిమా అంటే ఓ అంచనా ఉంటుంది. ఆ అంచనాలు 100% రీచ్ అయ్యే సినిమా. ఇంద్రసేన అందరికీ నచ్చుతుందన్నారు.
దర్శకుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ... ఇంద్రసేన పాటలు,మాటలు,సినిమా అన్నీ బాగుంటాయి. దర్శకుడు గా నన్ను, మా సినిమా ను ఆదరిస్తారని ఆసిస్తున్నాను. తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలిజ్ కు ప్లాన్ చెస్తొన్న నిర్మాత కృష్ణరెడ్డి గారికి దన్యవాదాలన్నారు.
శరత్ కుమార్ మాట్లాడుతూ.. జిఎస్టీ ఉంటే సినిమా హిట్. ఇంద్రసేన బ్రదర్ సెంటిమెంట్ తో నడిచె చిత్రం. ఫీల్ ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయన్నారు.
విజయ్ ఆంథోని మాట్లాడుతూ.. తెలుగు త్వరలో మాట్లాడతాను. బిచ్చగాడు తరహాలొనె ఇంద్రసేన ఓ స్పెషల్ స్టోరీ.. అందరికీ నచ్చుతుంది. నవంబర్ 30న సినిమాను నిర్మాత కృష్ణారెడ్డి గ్రాండ్ గా విడుదల చెస్తున్నారన్నారు.
విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి,
సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాత: కృష్ణారెడ్డి, రాధిక శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథొని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments