2047 నాటికి భారత్ అభివృద్ధే లక్ష్యం.. బడ్జెట్ విశేషాలు ఇవే..
Send us your feedback to audioarticles@vaarta.com
2024-25 సంవత్సరానికి గాను మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ఆమె ప్రకటించారు. సుమారు 57 నిమిషాల పాటు బడ్జెట్‌పై ప్రసంగం చేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇందులో ముఖ్యంగా దేశ భద్రత దృష్ట్యా రక్షణ రంగానికి సుమారు రూ6.2లక్షల కోట్ల నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ మాట్లాడుతూ గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పుకొచ్చారు. దాదాపు 80 కోట్ల మంది ఉచిత రేషన్ పథకం ద్వారా లబ్ధి పొందారని పేర్కొన్నారు. అలాగే పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశామన్నారు. మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్ ధన్ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశామన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.2.7లక్షల కోట్లు ఆదా అయిందన్నారు. స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణ అందించామని..
పీఎం ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్లు విలువ చేసే 43 కోట్ల రుణాలను మంజూరు చేశామని ఆమె వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని... పీఎం ఫసల్ బీమా యోజన కింద నాలుగు కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతోందని వివరించారు. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని నిర్మలమ్మ పేర్కొన్నారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా..
రక్షణ రంగానికి రూ.6.2 లక్షల కోట్లు
ఉపరితల రవాణా, జాతీయ రహదారులు రూ.2.78 లక్షల కోట్లు
రైల్వే శాఖకి రూ. 2.55 లక్షల కోట్లు
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీకి రూ.2.13 లక్షల కోట్లు
హొం శాఖకు రూ.2.03 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ.1.77లక్షల కోట్లు
రసాయనాలు, ఎరువులకి రూ.1.68 లక్షల కోట్లు
కమ్యూనికేషన్ల వ్యవస్థకి రూ.1.37 లక్షల కోట్లు
వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు
కేంద్ర పథకాలకు నిధుల కేటాయింపులు ఇలా..
గ్రామీణ ఉపాధి హామీ పథకం: రూ. 86వేల కోట్లు
ఆయుష్మాన్ భారత్ : రూ.7,500 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు : రూ.6,200 కోట్లు
సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి: రూ.6,903 కోట్లు
సోలార్ విద్యుత్ గ్రిడ్‌కి: రూ.8,500 కోట్లు
గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కి: రూ.600 కోట్లు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout