వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశమై చర్చించింది. అయితే నేడు అనగా సోమవారం సమావేశమై జట్టులో ఎవరెవరు ఉండాలా..? అనేదానిపై నిశితంగా చర్చించి 15 మంది టీమ్ సభ్యుల పేర్లను విడుదల చేసింది. ఈ టీమ్‌కు విరాట్ కొహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రోహిత్ శర్మకు వైస్ కెప్టన్ బాధ్యతలు అప్పగించారు.
టీమిండియా జట్టు సభ్యులు వీరే...
విరాట్ కొహ్లీ (కెప్టెన్)
రోహిత్ శర్మ
శిఖర్ థావన్
కేఎల్ రాహుల్
ఎమ్మెస్ ధోనీ (వికెట్ కీపర్)
కేదర్ జాదవ్
హార్థిక్ పాండ్యా
విజయ్ శంకర్
కుల్దీప్ యాదవ్
యజువేంద్ర చాహల్
జాస్ప్రిత్ బూమ్రా
భువనేశ్వర్ కుమార్
మహ్మాద్ షమీ
రాజేంద్ర జడేజా
దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్)
కాగా.. ఐపీఎల్లో అదరగొడుతున్న రిషబ్ పంత్‌కు స్థానం దక్కకపోవడం గమనార్హం. అలాగే అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్‌కు సైతం సెలెక్టర్లు షాకిచ్చారు. రిజర్వ్డ్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌కు జట్టులో స్థానం కల్పించారు.