గుడ్ న్యూస్ : ఈ నెల 12 నుంచి రైళ్లు నడుస్తాయ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఎక్కడిక్కడ చిక్కుకున్న కార్మికులు, విద్యార్థులకు ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఒకింత శుభవార్తే చెప్పింది. ప్రయాణికుల రైళ్లు ప్రారంభమయ్యే తేదీని రైల్వే శాఖ ప్రకటించడం శుభపరిణామం. ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. న్యూ ఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు మొత్తం 30 సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. కాగా వీటిని స్పెషల్ ట్రైన్లు అని పిలుస్తారు. ఈ రైళ్లు న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడవనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అంటే ఢిల్లీ కేంద్రంగానే రైళ్లన్నీ నడుస్తాయన్న మాట. ఇందుకు సంబంధించి ఇంకా షెడ్యూల్ రాలేదు. త్వరలోనే వెల్లడిస్తామని రైల్వేశాఖ తెలిపింది.
టికెట్లు బుక్ చేస్కోండి..
అయితే.. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్సీటీసీలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కాగా.. పరిస్థితిని బట్టి, రైలు బోగీలు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి దేశంలోని మరిన్ని ప్రాంతాలకు రైలు సర్వీసులను పునరుద్ధరిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే వలస కూలీలను తరలించేందుకు 300 శ్రామిక్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20వేల రైలు కోచ్‌లు కరోనా వైరస్ బాధితుల కోసం ఆస్పత్రులుగా మార్చి చికిత్స అందిస్తున్న విషయం విదితమే.
అన్నీ ఏసీ రైళ్లే..
కాగా ఈ నెల 12 నుంచి నడవనున్న ఈ ప్రత్యేక రైళ్లన్నీ ఏసీ కోచ్‌లతోనే నడుస్తాయని రైల్వే శాఖ ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాదు.. మునుపటిలాగా అన్ని స్టాప్స్‌లో ఆగవని పరిమిత స్టాప్స్‌లో మాత్రమే ఆగుతాయని ప్రకటించింది. అయితే.. టికెట్ ధరలకు మాత్రం రెక్కలొచ్చాయని చెప్పుకోవచ్చు. రాజధాని రైలుతో సమానంగా అన్ని ట్రైన్స్‌కు టికెట్ ధరలు ఉంటాయని తెలిపింది.
వీరికి మాత్రమే..
ఇదిలా ఉంటే.. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని రైల్వేశాఖ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు.. రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేలితేనే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అయితే సీటింగ్ ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments