ఎఫ్ 2..అనీల్ రావిపూడికి ఇండియన్ పనోరమ అవార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
2019 సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఎఫ్ 2..ఫన్ అండ్ ఫ్రస్టేషన్'. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా పరంగా డైరెక్టర్ అనీల్ రావిపూడికి అరుదైన గౌరవం దక్కింది. 2019 ఏడాదికిగానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమాకుగానూ కేంద్ర అవార్డు ఇండియన్ పనోరమని అవార్డును అనీల్ రావిపూడి అందుకోనున్నారు. ఆ ఏడాదిలో ఇండియన్ పనోరమను దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రం కూడా 'ఎఫ్2'నే కావడం విశేషం.
విక్టరీ వెంకటేష్, మిల్కీబ్యూటీ తమన్నా, వరుణ్‌తేజ్, మెహరీన్ నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమా రూపొందింది. ఔట్ అండ్ ఔట్ ఫ్యామలీ ఫన్ రైడర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హట్‌ను సాధించింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు తెలిపింది. డైరెక్టర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ "2019 ఇండియన్ పనోరమ అవార్డుల్లో ఎఫ్ 2 సినిమా డైరెక్టర్‌గా అవార్డును అందుకోనుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్, నా సోదరుడు వరుణ్‌తేజ్ సహా ఎంటైర్ యూనిట్‌కు ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు రాజుగారికి, శిరీష్‌గారు నాపై నమ్మకంతో సినిమాను నిర్మించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout