కర్ఫ్యూతో ప్రయోజనం లేదు.. కఠిన లాక్డౌన్ అవసరం: ఎయిమ్స్ చీఫ్
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణ స్థితికి చేరుకుంటాయని ఎయిమ్స్ చీఫ్ డా. రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలు సహా దేశంలో ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కఠినమైన లాక్డౌన్ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లతో ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో విధించిన తరహాలో కఠిన లాక్డౌన్ ప్రస్తుత తరుణంలో అవసరమన్నారు.
Also Read: బెంగాల్ విజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ షాకింగ్ ప్రకటన
ఓ ఇంటర్వ్యూలో గులేరియా మాట్లాడుతూ.. భారత్‌లోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధిస్తున్నప్పటికీ దాని ప్రభావం పెద్దగా ఆయా రాష్ట్రాలపై లేదని స్పష్టమవుతోందని రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరత సైతం ఏర్పడుతోందన్నారు. ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 12 మంది మరణించడం, వారిలో ఓ వైద్యుడు కూడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైద్యుడు తనకు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే తెలుసని ఆయన మరణం అత్యంత బాధాకరమని గులేరియా పేర్కొన్నారు. ఇక దేశంలోని ఆసుపత్రుల విషయానికి వస్తే వైద్య సదుపాయాలతో పాటు సిబ్బంది కొరత సైతం వేధిస్తోందని.. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా లేకుంటే దారుణ పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని గులేరియా పేర్కొన్నారు.
Also Read: మమతకు ఊహించని షాక్.. నందిగ్రామ్‌లో ఓటమి
మరోవైపు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య విపరీతంగా పెరగడంతో వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోతోంది. ప్రపంచంలోని ఏ ఆరోగ్య వ్యవస్థ కూడా ఈ తరహా పనిభారాన్ని మోయలేదన్నారు. కేసులను తగ్గించేందుకు కఠిన లాక్డౌన్ విధించడం లేదంటే మరేదైనా మార్గాన్ని అన్వేషించడమో చేయాలన్నారు. టీకాల కారణంగా ప్రజల్లో నమ్మకం పెరిగిపోయి కరోనా ఇక ఏం చేయలేదనే నిర్ణయానికి వచ్చేస్తున్నారని.. ఈ కారణంగానే కరోనా నిబంధనలను సైతం పాటించడం లేదన్నారు. ఇక మనలో హెర్డ్ ఇమ్యూనిటీ ఉందనే భావనలో ఉన్నాం. కానీ వైరస్‌లో మార్పులు ఏర్పడితే హెర్డ్ ఇమ్యూనిటీ వైరస్‌ను తట్టుకోలేదన్నారు. అప్పుడు పరిస్థితిని ఊహించలేమని గులేరియా హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com