నేవీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు నిషేధం

  • IndiaGlitz, [Monday,December 30 2019]

భారత రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని రోజులుగా పాకిస్తాన్, చైనాతో పాటు పలుదేశాలు హనీట్రాప్‌కు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తద్వారా ఊహించని రీతిలో నావీకి నష్టం వాటిల్లుతోంది. తాజాగా.. ట్రాప్‌లో ఏడుగురు నేవి అధికారులు చిక్కుకోవడంతో రక్షణ రంగం ఒక్కసారిగా షాకైంది. అయితే అలెర్టయిన నావీ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాజాగా జరిగిన ఈ ఘటనతో నేవి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులెవ్వరూ సోషల్ మీడియాను (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్) వాడకూడదని నిషేదాజ్ఞలు విధించింది. అంతేకాదు.. నావల్‌ బేస్‌లు, డాక్‌ యార్డులు, ఆన్‌బోర్డ్‌ వార్‌ షిప్‌లపై సిబ్బంది ఎవరూ స్మార్ట్‌ ఫోన్‌లు కూడా వాడకుండా బ్యాన్‌ విధించింది. వీటితో పాటు.. మెసేజింగ్‌ యాప్‌లు, నెట్ వర్కింగ్‌, బ్లాగింగ్‌, కంటెంట్‌ షేరింగ్‌, ఈ కామర్స్‌ సైట్లను కూడా నిషేధిత జాబితాలోకి అధికారులు తీసుకొచ్చారు. కాగా.. నేవీ చరిత్రలో అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇదే మొదటి సారి. నేవీ వరకూ ఇవి చాలా కీలక చర్యలుగానే భద్రతాధికారులు భావిస్తున్నారు.

కాగా.. ఇలాంటి ఘటనల్లో ఏడుగురు నేవీ ఉద్యోగులతోపాటు ఓ హవాలా రాకెట్ ఆపరేటర్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అమ్మాయిల అందచందాలను, డబ్బును ఎరగా వేసి అధికారులను బుట్టలో వేసుకొని వారి వద్ద నుంచి రక్షణరంగానికి చెందిన విలువైన సమాచారం రాబట్టేందుకు పాక్, చైనా దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్మీ, నేవీకి సంబంధించిన పలువురు ఉద్యోగులను పాక్ హనీట్రాప్ చేసి బుట్టలో వేసుకోవడంతో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని భావించిన ఉన్నతాధికారులు నిశితంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

More News

సినిమాల్లో నటిస్తారా అని కేటీఆర్‌ను అడగ్గా..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అప్పుడప్పడు కేటీఆర్‌ ప్రత్యేకంగా ఫ్యాన్స్,

2020లో బ్లాక్ బాస్టర్ అల్బమ్ తో వస్తున్న 'అల వైకుంఠపురంలో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

'అమ్మాయంటే అలుసా' చిత్రాన్ని దిశ కు అంకిత మిస్తున్నాను.... హీరో, నిర్మాత,దర్శకుడు నేనే శేఖర్

నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో   గీతాశ్రీ అర్ట్స్ పతాకంపై నేనే శేఖర్, కార్తీక్ రెడ్డి,స్వాతి,శ్వేత,

సింహా సింగపూర్ తీసుకెళతాడనే నమ్మకం వుంది: సంగీత దర్శకులు ఎమ్.ఎమ్.కీరవాణి

అది 2000వ సంవత్సరం కెరీర్, డబ్బుల పరంగా నాకు బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. ఉమ్మడి  కుటుంబసభ్యుల బాధ్యతలు నాపై ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో శ్రీసింహాకు నాలుగేళ్లు ఉంటాయి.

తూటా` నిర్మాత‌గా నాకు మంచి గుర్తింపునిస్తుంది - జి. తాతారెడ్డి

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ హీరోగా లెజెండ‌రీ డైరెక్ట‌ర్ గౌత‌మ్‌వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ఎన్నై నోకి పాయ‌మ్ తోట‌. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు ముగిసాయి. యు ఏ స‌ర్టిఫికేట్ పొందిన