The Elephant Whisperers:మరో భారతీయ చిత్రానికి ఆస్కార్.. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు పురస్కారం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటుకు బెస్ట్ ఒరిజినటల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ లభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పేరు యావత్ దేశం మారుమోగిపోతోంది. అయితే 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో మరో భారతీయ చిత్రానికి కూడా ఆస్కార్ దక్కింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’’ను ఆస్కార్ వరించింది. ఈ మేరకు దర్శకురాలు కార్తికి గోన్ సాల్వెస్, నిర్మాత గునీత్ మోగ్నలు అవార్డ్ అందుకున్నారు.
అసలేంటీ ఈ షార్ట్ ఫిల్మ్ కథ:
ది ఎలిఫెంట్ విస్పరర్స్ కథ విషయానికి వస్తే.. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు వాటిని దగ్గరికి తీసిన ఇద్దరు దంపతుల చుట్టూ తిరిగేది ఈ కథ. డాక్యుమెంటరీ అనగానే గంటో, రెండు గంటలో కాకుండా ఏకంగా 450 గంటల ఫుటేజీని చిత్రీకరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ది ఎలిఫెంట్ విస్పరర్స్. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ దర్శకురాలు కార్తీకి గోన్‌సాల్వెస్ పేరు మారుమోగిపోతోంది.
ఆ సంఘటనే డాక్యుమెంటరీగా:
తన ఇంటి ముందు ఏనుగుతో వెళ్తున్న వ్యక్తిని చూసిన తర్వాత తన మనసులో మెదిలిన ఆలోచననే ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’గా తెరకెక్కించినట్లు కార్తీకి చెప్పారు. ఈ డాక్యుమెంటరీలో కట్టునాయకన్ తెగ సంస్కృతీని తెలియజేసే అవకాశం వచ్చిందని ఆమె తెలిపారు. అలాగే డాక్యుమెంటరీలో కనిపించే బొమన్, బెల్లీ ఇద్దరూ ఆ ఏనుగు పిల్లలను నిజంగా పెంచుతున్నవాళ్లే కావడం విశేషం.
నాటు నాటుకు ఆస్కార్ :
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోతోంది. ఎన్నో ఏళ్లు కలగా మిగిలిపోయిన ఆస్కార్ ఇప్పుడు కోరి మనల్ని వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘అప్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను దక్కించుకుంది. దీంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోయింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను దక్కించుకుందని తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆ చిత్ర బృందానికి విషెస్ తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout