Rishabh Pant and Akshar Patel:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్
Send us your feedback to audioarticles@vaarta.com
భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమలకు వచ్చిన ఇద్దరు ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం తరువాత రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. టీటీడీ అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌ను చూసిన భక్తులు, అభిమానులు సెల్పీల కోసం పోటీపడ్డారు.
అక్టోబర్ నెల ఆదాయం రూ.108.65కోట్లు..
అక్టోబర్ నెలలో శ్రీవారిని 21.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. హుండీ కానుకలు ద్వారా రూ.108.65 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 1.05 కోట్ల లడ్డూలు విక్రయించామని.. 47.14 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొ్న్నారు. 8.30 లక్షల మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు. ఇక గురువారం 59,335 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు వచ్చింది. ప్రస్తుతం శ్రీవారి ఉచిత దర్శనం కోసం 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
డిసెంబర్ 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనం..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నవంబరు 10న ఆన్‌లైన్‌లో 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. డిసెంబరు 22న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు 4.25 లక్షల టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామన్నారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 7 రోజుల్లోపు వారి ఖాతాలకు కాషన్ డిపాజిట్ మొత్తం జమ చేస్తున్నామని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments