Rishabh Pant and Akshar Patel:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్

  • IndiaGlitz, [Friday,November 03 2023]

భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమలకు వచ్చిన ఇద్దరు ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం తరువాత రంగనాయక మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. టీటీడీ అధికారులు ప్రోటోకాల్ దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌ను చూసిన భక్తులు, అభిమానులు సెల్పీల కోసం పోటీపడ్డారు.

అక్టోబర్ నెల ఆదాయం రూ.108.65కోట్లు..

అక్టోబర్‌ నెలలో శ్రీవారిని 21.75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. హుండీ కానుకలు ద్వారా రూ.108.65 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 1.05 కోట్ల లడ్డూలు విక్రయించామని.. 47.14 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొ్న్నారు. 8.30 లక్షల మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు. ఇక గురువారం 59,335 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు వచ్చింది. ప్రస్తుతం శ్రీవారి ఉచిత దర్శనం కోసం 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

డిసెంబర్ 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనం..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్‌ 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. న‌వంబ‌రు 10న ఆన్‌లైన్‌లో 2.25 ల‌క్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. డిసెంబ‌రు 22న తిరుప‌తిలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు 4.25 ల‌క్షల టైంస్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామన్నారు. క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 7 రోజుల్లోపు వారి ఖాతాలకు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం జమ చేస్తున్నామని చెప్పారు.

More News

KCR Kasani:బీఆర్ఎస్‌లో చేరిన కాసాని.. సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Bharatiyadudu 2:అదిరిపోయిన భారతీయుడు2 ఇంట్రో.. గూస్‌బంప్స్ పక్కా..

లోకనాయకుడు కమల్ హాసన్, అగ్ర డైరెక్టర్ శంకర్ కలయికలో ఇండియన్-2 చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

CM KCR:ఆగమాగం కావొద్దు.. విచక్షణతో ఓటు వేయండి.. ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు

పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు రెండు, మూడు సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

MP Rammohan Naidu:విజయ్ దేవరకొండ సహాయం.. ఎంపీ రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తన సినిమాల నుంచి వచ్చిన సంపాదనతో పేదలకు సహాయం చేస్తూ ప్రజల్లో మంచిపేరు సంపాదించుకుంటున్నారు.

రూల్స్ బ్రేక్ చేయడంలో చంద్రబాబే నంబర్ వన్

అనారోగ్యంగా ఉందన్నారు.. కళ్లు కనపడడం లేదన్నారు.. చర్మ సమస్యలు అన్నారు.. కనుక మీ ఆరోగ్య పరిస్థితిని గమనించి.. మీకు కంటి చికిత్స అవసరాన్ని గుర్తించి నాలుగు వారాల పాటు