ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే 'బాహుబలి'...

  • IndiaGlitz, [Monday,May 08 2017]

తెలుగు ప్రేక్ష‌కుడంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఆద‌రించే ప్రేక్ష‌కుడని, కొత్త‌ద‌నానికి పెద్ద పీట వేయ‌డని, ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌లు, హీరోల ఆలోచ‌న‌లు ప‌రిమితంగానే ఉంటాయ‌నే ఆలోచ‌న‌ల‌ను తిర‌గ‌రాసిన సినిమా 'బాహుబ‌లి-2'. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన బాహుబ‌లి రెండు పార్టులుగా తెర‌కెక్కింది. పార్ట్‌1గా విడుద‌లైన బాహుబ‌లి ది బిగినింగ్ ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూళు చేసి ఇండియ‌న్ సినిమా దృష్టిని ఆక‌ర్షిస్తే, పార్ట్ 2గా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన బాహుబ‌లి-2 బాలీవుడ్ స్టార్స్ న‌టించిన అన్నీ సినిమాల దుమ్ము దులేపేసి ఏకంగా 1000 కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

ఈ రికార్డు క్రియేట్ చేసిన ఏకైక సినిమా, అది కూడా మ‌న తెలుగు సినిమా కావ‌డం మ‌నం అందరం గ‌ర్వంగా ఫీల్ కావాల్సిన సినిమా. విడుద‌ల‌కు ముందు మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని అనుకున్నారు కానీ ఏకంగా 1000 కోట్లు సాధిస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. అసాధ్య‌మైన క‌ల‌ను కూడా సుసాధ్యం చేసిన సినిమా ఇది. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంలో విడుద‌లైన బాహుబ‌లి-2 అన్నీ భాష‌ల్లో రికార్డు క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమాలనీ చాలా మందికి ఉండే ఆలోచనలను పటాపంచలు చేస్తూ ఇండియన్ సినిమా అంటే విదేశీయలు సైతం బాహుబలి అనే విధంగా తెలుగు సినిమా మ‌ణిహారంగా ఇండియ‌న్ సినిమాకు గొప్ప పేరును తెస్తూ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించింది.