నెక్స్ట్ టార్గెట్ ‘పీవోకే’.. మేం దేనికైనా రెఢీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ భారత్‌లో పూర్తిగా అంతర్భాగమైన సంగతి తెలిసిందే. అయితే.. ఇక మిగిలిందల్లా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మాత్రమే. దీని కోసం అటు పాక్ పోరాటం చేస్తుండగా.. భారత్ మాత్రం ఎప్పుడైనా మనదే.. దీనికోసం ఏం చేయడానికి రె‘ఢీ’ అంటోంది. ఈ క్రమంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన ప్రకటన చేశారు. పీవోకేను ఆక్రమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఫైనల్‌గా కేంద్ర ప్రభుత్వమేనని నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బిపిన్ చెప్పుకొచ్చారు.
కశ్మీర్ పరిస్థితులపై..!
ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్నదంతా తమ మంచి కోసమేనని జమ్మూ కశ్మీర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్ ప్రజలు 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నారనీ... ఇకపై అక్కడ శాంతి నెలకొనేలా సహకరించాలని రావత్ ఈ సందర్భంగా కోరారు. శాంతియుత వాతావరణం ఏర్పడితేనే ఇన్నాళ్లూ ఏమి కోల్పోయారన్నది అక్కడి ప్రజలకు అర్థమవుతుందన్నారు.
ఇదిలా ఉంటే.. వాస్తవానికి 370 ఆర్టికల్ రద్దు అయిన రోజే పార్లమెంట్ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పీవోకే కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని ప్రకటించిన విషయం విదితమే. షా ఈ ప్రకటన చేసిన తర్వాత భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రపంచ దేశాల దగ్గర పాక్ కారు కూతలు కూస్తోంది.. అయినప్పటికీ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు... అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో కూడా దాయాది దేశానికి ఊహించని ఎదురుదెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments