'ఇండియ‌న్ 2' ఆగిపోలేదు...

  • IndiaGlitz, [Thursday,May 16 2019]

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాష్ క‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో 2.0 త‌ర్వాత రూపొందుతోన్న సినిమా ఇది. అయితే ఇటీవ‌ల భారీ బడ్జెట్ విష‌యంలో నిర్మాణ సంస్థ శంక‌ర్‌కు ప‌రిమితులు విధించ‌డంతో శంక‌ర్ మ‌రో నిర్మాణ సంస్థ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు వినిపించాయి.

దీంతో సినిమా ఆగిపోయింద‌ని, నిర్మాత‌లు మారుతున్నారంటూ ప‌లు వార్త‌లు వినిపించాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్సే నిర్మించ‌డానికి నిర్ణ‌యించుకుంద‌ట‌. జూన్ నుండి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ట‌. సినిమాను 2021 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.