'ఇండియ‌న్ 2' మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...

  • IndiaGlitz, [Tuesday,December 11 2018]

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ... 22 ఏళ్ల త‌ర్వాత మ‌రో సినిమా రూపొంద‌నుంది. ఆ సినిమాయే 'ఇండియ‌న్ 2'. . 1996లో 'ఇండియ‌న్‌' సినిమాకు ఇది సీక్వెల్‌గా రానుంది. క‌మ‌ల్‌హాస‌న్ చివ‌రి చిత్రం కూడా ఇదేన‌ని ఆయ‌న ప్ర‌క‌టించేశారు. త‌ర్వాత రాజ‌కీయాల్లో ఆయ‌న రంగం ప్ర‌వేశం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

ఇక 'ఇండియ‌న్ 2' విష‌యానికి వ‌స్తే.. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రో ప‌క్క సెట్స్ నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 14 నుండి శంక‌ర్ ఇండియ‌న్ 2 షూటింగ్ చేయ‌బోతున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రానికి యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ సంగీతం అందించ‌బోతున్నార‌ట‌. రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్ 'పేట్ట‌'కు సంగీతం అందించిన అనిరుధ్ .. మ‌రో లెజెండ్రీ న‌టుడు క‌మ‌ల్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'ఇండియ‌న్ 2'కి సంగీతం అందించ‌బోతున్నారు.