'ఇండియన్ 2' సినిమాకు సంగీత దర్శకుడెవరో తెలుసా?

  • IndiaGlitz, [Wednesday,December 20 2017]

శంక‌ర్ సినిమాలకు ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తూ వ‌స్తున్నాడు. 'అప‌రిచితుడు' స‌మ‌యంలో రెహ‌మాన్ అందుబాటులో లేక‌పోవ‌డంతో హారీష్ జైరాజ్ సంగీతం అందించాడు. అలాగే ఇప్పుడు మ‌రోసారి శంక‌ర్ సినిమాకు ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించ‌బోడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే..క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఇండియ‌న్ 2 తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. '2.0' పూర్త‌యిన త‌ర్వాత శంకర్ 'ఇండియ‌న్ 2'పై కాన్‌స‌న్ ట్రేష‌న్ చేస్తాడు. ఈ సినిమాకు కూడా ఎ.ఆర్‌.రెహ‌మాన్ అందుబాటులో ఉండ‌డ‌ని, కాబ‌ట్టి ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తాడ‌ని కోలీవుడ్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి దీనిపై శంక‌ర్ అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.