భారతీయుడు 2: కాజల్ ప్లేస్‌లో తమన్నా.. రూమర్స్‌కి త్వరలోనే క్లారిటీ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ దర్శక దిగ్గజం శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘‘ఇండియన్ 2’’ సినిమాపై పరిశ్రమలో అంచనాలు భారీగా వున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పాతికేళ్ల క్రితం విడుదల ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కమల్ నటన, శంకర్ టేకింగ్, మర్మకళ, పాటలు ‘‘భారతీయుడి’’ని ఎక్కడో నిలబెట్టాయి. దీనికి సీక్వెల్ తీయాలని అప్పట్లోనే ప్లాన్ చేసినప్పటికీ కుదరలేదు. దీంతో దాదాపు రెండున్నర దశాబ్ధాల తర్వాత ‘‘భారతీయుడు 2’’ కార్యరూపం దాల్చింది.
కానీ సెట్స్‌పైకి వెళ్లిననాటి నుంచి ఈ సినిమాకు ఏదో ఒక అవాంతరం వస్తూనే వుంది. తొలినాళ్లలోనే షూటింగ్‌లో క్రేన్ కూలి ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ తర్వాత కరోనా, లాక్‌డౌన్, లైకా ప్రొడక్షన్స్- దర్శకుడు శంకర్ మధ్య వివాదాలు, ఇప్పుడు కమల్ హాసన్‌కు కరోనా వంటి ఇబ్బందులతో ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా పరిస్ధితి తయారైంది. అన్ని కుదురుకుంటున్న దశలో ఇప్పుడు కాజల్ అగర్వాల్ రూపంలో సమస్య వచ్చింది.
'ఇండియన్ 2' ప్రాజెక్ట్ నుంచి కాజల్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ ఇప్పుడు గర్భవతి అని, అందుకే సినిమా వదిలేసిందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి మేకర్స్ అన్వేషణలో పడ్డారట. తొలుత కాజల్ స్థానంలో త్రిషను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు మిల్క్ బ్యూటీ తమన్నా పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గానూ, వయసు మళ్లిన పాత్రలోనూ కనిపించాల్సి ఉంది. ఈ క్యారెక్టర్ తమన్నాకి కూడా నచ్చడంతో హీరోయిన్‌గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. దీనికి సంబంధించి త‍్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments