Congress:ఇండియా టుడే సర్వేలోనూ కాంగ్రెస్‌కే పట్టం.. సీఎంగా మొగ్గు ఎవరికంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దీంతో తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే టెన్షన్‌లో ఉన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. తాజాగా ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సంస్థ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 63-73 సీట్లు వస్తాయని.. బీఆర్ఎస్‌కు 34-44 సీట్లు.. బీజేపీ 4-8 సీట్లు.. ఇతరులకు 5-8 సీట్లు వస్తాయని ప్రకటించింది.
సీఎంగా కేసీఆర్ వైపే మొగ్గు..
తెలంగాణలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో కేసీఆర్ మరోసారి సీఎం కావాలని 32శాతం మంది ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఫర్వాలేదని 22శాతం మంది ప్రజలు.. రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని 21శాతం మంది ప్రజలు కోరుకున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక రూరల్, అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు పట్టం కట్టినట్టు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపినట్టు సమాచారం.
బీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేస్తున్నారు..
ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తమను గుర్తుంచుకోవాలని అవసరమైతే తాము కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటామని అడుగుతున్నారని పేర్కొన్నారు. కానీ తమకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం లేదని.. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు..
మరోవైపు ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. "బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవితవ్యం గురించి తనకు తెలియదు. కానీ సర్వే ఫలితాలను బట్టి చూస్తే బీఆర్ఎస్ రాజకీయ ప్రయాణం అధికార పక్షంగానే ముగుస్తుందని మాత్రం చెప్పగలనని పేర్కొన్నారు. తెలంగాణకు రానున్న మంచి రోజుల కోసం, కాంగ్రెస్ విజయం కోసం డిసెంబరు 3 వరకు చూద్దామని అన్నారు. హరహర మహాదేవ, జై తెలంగాణ, జై హింద్" అని ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com