డేర్ ఇండియా: సర్జికల్ స్ట్రైక్-2.. 300 మంది ఉగ్రమూకల హతం!?
Send us your feedback to audioarticles@vaarta.com
పుల్వామాలో ఉగ్రదాడిలో 42మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మన ఆర్మీ అవకాశం కోసం వేచి చూసింది. ఈ దుర్ఘటన చోటుచేసుకున్న మరుక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ సైన్యానికి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రీ ఫ్లా్న్డ్‌గా ముందుకెళ్లిన ఇండియన్ ఆర్మీ, భారత వాయుసైన్యం (ఎయిర్‌ఫోర్స్) ఉగ్రమూకలపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మంగళవారం తెల్లవారుజామున (ఫిబ్రవరి-26) 3:45 నుంచి 3:53 మధ్యలో జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై ఈ స్ట్రైక్ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 300మంది ఉగ్రమూకలు హతమైనట్లు తెలుస్తోంది. ఈ స్ట్రైక్‌లో మొత్తం 12 మిరేజ్ 2000 ఫైటర్ జెట్లతో సుమారు వెయ్యి కిలోల బాంబులను తీవ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ప్రయోగించినట్లు సమాచారం. తెల్లవారుజామున కావడంతో నిద్రలో ఉగ్రమూకలన్నీ నిద్రలో జోగుతుంటాయని భావించిన ఇండియన్ ఆర్మీ తన సత్తా ఏంటో మరోసారి చూపించింది. ఇదిలా ఉంటే.. మరోవైపు పాక్ ఆర్మీ తేరుకునేలోపే భారత వాయుసేన టార్గెట్ పూర్తి చేసింది. అయితే ఈ స్ట్రైక్స్ అన్నీ తప్పు.. మాకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పాక్ చెబుతుండటం గమనార్హం.
సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడెక్కడ జరిగాయి..?
ముజఫర్‌బాద్‌కు 24 కిలోమీటర్లు దూరంలో ఉన్న బాల్కోట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 3:45 నుంచి 3:53 కేవలం 8 నిమిషాలు మాత్రమే స్ట్రైక్స్ జరిగాయి. ఈ ఘటనలో ఉగ్రమూకలకు సంబంధించిన పెద్ద స్థావరమే కుప్పకూలిందని తెలిసింది.
ముజఫరబాద్‌కు అతి దగ్గర్లోనే 3:48 నుంచి 3:55 మధ్యలో మరో ఉగ్రవాద స్థావరంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది.
చకోటిలో 3:58 నుంచి 4:04 మధ్యలో స్ట్రైక్స్ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ స్ట్రైక్స్‌లో ఒక్క జైష్-ఎ-మహ్మాదే కాకుండా లష్కర్-ఎ-తోయిబా, హిజ్-బుల్-ముజాయిద్దీన్‌కు సంబంధించిన ఉగ్రమూకలు కూడా హతమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే ఇందుకు సంబంధించిన చిన్నపాటి సమాచారం కూడా అధికారికంగా వెలువడలేదు. కాగా కార్గిల్ యుద్ధం తర్వాత భారత్‌లో ఇలా దాడులు చేయడం ఇదేతొలిసారి. అంతకుముందు జమ్ములోని వేర్పాటువాదుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలియక ఉగ్రమూకలు అయోమయానికి గురయ్యారు. ఇలా వ్యూహాత్మకంగానే పాక్, దానికి మద్దతుగా నిలిచే వారికి ఏకకాలంలోనే చెక్ పెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు దాడి తర్వాత భారత వైమానిక దళం హై అలర్ట్ ప్రకటించింది. పాక్ నుంచి ఎలాంటి స్పందన వచ్చినా ధీటుగా బదులిచ్చేందుకు భారత వైమానిక దళం సిద్ధమైంది. ఇప్పటికే ఎయిర్ బేస్‌లను సిద్ధం చేసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అన్ని స్థాయిల్లోనూ అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. అటు పాక్ సరిహద్దుల్లోని ఎయిర్ డిపెన్స్ సిస్టంను భారత్ సైన్యం సిద్ధం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout