ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్‌ను ప్రారంభించిన భారత్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియాలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు పుణెకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)తో పాటు బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను పుణెలోని భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 1600 మందిపై ఈ ప్రయోగాలను ఎస్ఐఐ నిర్వహిస్తోంది.
ఇటీవలే భారతీయులందరికీ ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. త్వరలోనే కరోనా నుంచి విముక్తి కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ‘కోవిషీల్డ్’ అన్న కరోనా వ్యాక్సిన్‌ను అక్టోబర్ చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. భారతీయులందరికీ వ్యాక్సిన్‌ను నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద భారత ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేయనున్నట్టు సంస్థ వెల్లడించింది.
ఇప్పటికే భారత ప్రభుత్వం తమకు లైసెన్స్ ఇచ్చిందని.. ట్రయల్స్ ప్రోటోకాల్స్‌ను కూడా వేగవంతం చేసినట్టు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇప్పటికే మొదటి దశ ప్రయోగాలను పూర్తి చేసుకున్న కోవాక్సిన్ వ్యాక్సిన్ నేడు రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫలితం 15 రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అనంతరం వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో విడుదల చేయాలని తాము భావిస్తున్నామని.. ఇందుకోసం ఏర్పాటు పూర్తి చేస్తున్నామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు స్పష్టం చేశారు. మొత్తానికి అనుకున్న సమయానికే కోవాక్సిన్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments