కరోనా రికవరీ రేటు పరంగా ఇండియా వరల్డ్ రికార్డ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియా కరోనా కేసుల సంగతి ఎలా ఉన్నా.. రికవరీ రేటు మాత్రం రికార్డ్ స్థాయిలో ఉండటం ఊరటను కలిగిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్ రికవరీ రేటు నమోదైన దేశంగా ఇండియా రికార్డ్ క్రియేట్ సేసింది. ప్రస్తుతం దేశంలో 78 శాతానికి రికవరీ రేటు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 77,512 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ సందర్భంగా రికవరీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను కూడా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
మహరాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కేసుల పరంగా ప్రపంచంలోనే ఇండియా రెండో స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 96 లక్షల 25 వేల 959 మంది పూర్తిగా కోలుకోగా... ఇందులో భారత్ నుంచే అత్యధికంగా 37,80,107 మంది కోలుకున్నట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కలు చెబుతున్నాయి.
ఇంత భారీ మొత్తంలో రికవరీ రేటు ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కలు చెబుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి విషయంలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో మొత్తం 37,23,206 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఏదీ ఏమైనా అత్యధిక ప్రజానీకం కరోనా నుంచి కోలుకోవడం చాలా ఊరటనిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments