భారత్‌లో కరోనా.. డిశ్చార్జ్‌లలో ఇదే రికార్డ్..
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే విశేషం ఏంటంటే.. నేడు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో డిశ్చార్జ్ కావడం ఇదే తొలిసారి. కరోనా యాక్టివ్ కేసుల కంటే కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య రెట్టింపు ఉన్న విషయం తెలిసింది. ఆ డిశ్చార్జ్‌లు మంగళవారం 50 వేలకు పైగా ఉండటం విశేషం.
మంగళవారం ఒక్కరోజే 51,706 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశంలో 19,08,254 కేసులు నమోదవగా.. 12,82,215 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 39,795 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,86,244 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. గత 14 రోజులతో పోలిస్తే రికవరీ రేటు 63 శాతం నుంచి 67.19 శాతానికి పెరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout