భారత్‌లో 57 లక్షలకు చేరువలో కేసులు..
- IndiaGlitz, [Wednesday,September 23 2020]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 57 లక్షలకు చేరువవుతుండగా.. మరణాల సంఖ్య 90 వేలు దాటింది. అలాగే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,53,683 పరీక్షలు నిర్వహించగా.. 83,347 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 56,46,011కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1085 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 90 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 89,746 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 45,87,613కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 9,68,377 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా రికవరీ రేటు 81.25 శాతం ఉండగా.. మరణాల రేటు 1.59 శాతంగా ఉంది. కాగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 6,62,79,462 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.