ఆ రెండు నెలల్లో పాక్-భారత్ మధ్య యుద్ధం..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రత్యర్థి, దాయాది దేశమైన పాకిస్థాన్.. భారత్‌పై అస్తమానూ కాలు దువ్వుతూనే ఉంది. ఆర్టికల్-370 రద్దుతో మరింత జోరు పెంచిన పాక్.. భారత్‌ను అందరి ముందూ దోషిగా నిలబెట్టాలనుకుని ఇతరదేశాలు మొదలుకుని ఆఖరికి ఐక్యరాజ్యసమితి వరకూ వెళ్లింది. అయితే అన్ని చోట్లా ఎదురుదెబ్బ తగలడమే కాదు.. తుపుక్కుమని ఊశాయి ప్రపంచ దేశాలు. మరోవైపు ఇతరదేశాలు సైతం పాక్‌తో ఉన్న సంబంధాలను తెంచుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇదంతా భారత్ వల్లే జరుగుతోందని భావిస్తున్న పాక్‌కు ఏం చేయాలో దిక్కుతోచట్లేదు.
వాస్తవానికి పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని భారత్, కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఎన్నో ఏళ్లుగా దాయాది దేశాలు అంతర్జాతీయ వేదికలపై చెబుతూనే వస్తున్నాయి. 370ని రద్దు చేయడంతో పాక్ ఒక్కసారిగా స్వరం మార్చేసింది. ఆ దేశ ప్రధాని మొదలుకుని మంత్రులు మీడియా ముందుకు వచ్చి తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇదే ఆఖరి యుద్ధం!
తాజాగా.. పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ ఏకంగా యుద్ధానికి సిద్ధం.. ఫలానా టైమ్‌లో యుద్ధం జరగొచ్చని జోస్యం చెప్పుకొచ్చారు. సెప్టెంబరు లేదా అక్టోబరులో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం జరుగొచ్చని ఆయన తెలిపారు. అంతటితో ఆగని ఆయన.. ఈ యుద్ధమే చివరి యుద్ధమవుతుందని జోస్యం చెప్పారు. కశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందుకు రావడం లేదని మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి యూఎన్ఎస్సీ చొరవ చూపి ఉంటే.. ఇప్పటికే కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఉండేదని కానీ ఆ పని జరగలేదన్నారు. అయితే అస్తమాను ఇలా మీడియా ముందుకొచ్చి ఉత్తుత్తి కూతలు కూస్తున్న పాక్ మంత్రులకు ఇండియా నుంచి ఎలాంటి కౌంటర్ వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments