పాక్‌కు మరో సడన్ షాకిచ్చిన భారత్...
Send us your feedback to audioarticles@vaarta.com
పుల్వామా ఘటన అనంతరం దాయాది దేశమైన పాక్‌కు భారత్ వరుస షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే 'అత్యంత అభిమాన దేశం' (మోస్ట్ ఫేవర్డ్ నేషన్) హోదాను ఇండియా రద్దు చేస్తూ షాక్ ఇవ్వడంతో ఆ ప్రభావం పాక్ ఎగుమతులపై పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. భారత్-పాక్ దేశాల మధ్య జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంట జరుగుతున్న వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ సడన్ షాక్‌తో పాక్ కంగుతిన్నది.
కాగా.. మామిడికాయలు, ఎండు మిరప, మూలికలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, కాలిఫోర్నియా ఆల్మండ్ సహా 21 ఉత్పత్తుల కొనుగోలు-అమ్మకాలను రద్దుచేస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. అయితే ఇలా వాణిజ్యం అనే ముసుగులో ఉగ్రమూకలకు ఆయుధాలు, డ్రగ్స్, ధన సహాయం అందుతోంది. దీంతో ఆదిలోనే పాక్‌కు అడ్డుకట్ట వేయాలని భావించిన భారత్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంతో 280 వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. కాగా.. స్థానిక ప్రజలకు ఉపయోగపడే వస్తువుల అందుబాటును సులభతరం చేసేందుకు ఎల్‌ఒసి ట్రేడ్‌కు గతంలో అనుమతిచ్చారన్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com