ఐదేళ్లలో కనిష్టానికి పడిపోయిన భారతదేశ జీడీపీ వృద్ధి

  • IndiaGlitz, [Friday,May 31 2019]

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి మార్చి త్రైమాసికం సహా (జనవరి–మార్చి) 2018–19 ఆర్థిక సంవత్సరం గణాంకాలు శుక్రవారం వెలువడ్డాయి. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణం చేసిన అనంతరం కేంద్రంలో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. శుక్రవారం సాయంత్రం రోజున కేంద్ర గణాంకాల కార్యాలయం ఈ గణాంకాలను విడుదల చేసింది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం కంటే తక్కువగా 6.8 శాతంగా ఉందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వ్యవసాయ, ఉత్పాదక రంగాల్లో పేలవమైన పనితీరు కారణంగా భారత ఆర్థిక వృద్ధిరేటు జనవరి-మార్చి నెలలో 5.8 శాతానికి తగ్గింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం కంటే తక్కువగా 6.8 శాతంగా ఉందని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వెల్లడించింది.

2014-15 నుండి స్థూల దేశీయోత్పత్తి వృద్ధి నెమ్మదిగా ఉంది. 2013-14లో మునుపటి కనిష్ట శాతం 6.4 శాతంగా ఉంది. నాలుగో త్రైమాసికంలో చైనా 6.4 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే 2019–20లో 7.1 శాతం, 2020–2021లో 7.2 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలో తేలిందని ఫిక్కీ వివరించింది. 2019–20లో వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.3 శాతం వరకూ ఉంటుందని సర్వే పేర్కొన్నట్లు తెలిపింది. అంతటితో ఆగని ఫిక్కీ మరింత మెరుగుపడాలంటే ఏమేం చేయాలో కూడా వెల్లడించింది. సకాలంలో రుణ లభ్యత, జీఎస్‌టీ రిఫండ్స్‌ జరగాలని, ఎగుమతి సంబంధిత మౌలిక రంగం మరింత మెరుగుపడాలని ఆయా అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయనీ అభిప్రాయపడింది.

More News

'భార‌త్‌' ఉంచుతారా? ఉంచ‌రా?

`భార‌త్‌` అంటే ఈ మ‌ధ్య దేశం క‌న్నా, స‌ల్మాన్‌ఖాన్ సినిమా అనేది ఎక్కువ మందికి గుర్తుకొస్తుంది. అంత‌గా జ‌నాల్లోకి వెళ్లింది స‌ల్మాన్ తాజా సినిమా `భార‌త్‌`.

'గీత‌' లో అడ్డాల - నాని?

గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే సినిమాలో అడ్డాల శ్రీకాంత్‌, నాని క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. గ‌త కొంత‌కాలంగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్న శ్రీకాంత్ అడ్డాల

సాయిప‌ల్ల‌వికి ఎవ‌రూ క‌నిపించ‌ర‌ట‌

హీరోయిన్‌గా తెరంగేట్రం చేయ‌డం వేరు. ఆ త‌ర్వాత ఓ హిట్టు సాధించ‌డం, దాన్ని నిల‌బెట్టుకోవ‌డం వేరు. ఇప్పుడు తాను సాధించిన విజ‌యాన్ని నిల‌బెట్టుకుంటూ

హీరో సూర్యకు ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్..!

ఎన్నికల సీజన్ వచ్చినా.. సినిమా రిలీజ్‌ అయినా అభిమానులు, కార్యకర్తలు చేసే హంగామా మామూలుగా ఉండదు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్స్ దర్శనమిస్తుంటాయ్.

'కెప్టెన్ రాణా ప్రతాప్‌' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ద‌ర్శ‌క నిర్మాత హ‌రినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్ర‌తాప్‌`. `ఎ జ‌వాన్ స్టోరి` క్యాప్ష‌న్‌.