ఐదేళ్లలో కనిష్టానికి పడిపోయిన భారతదేశ జీడీపీ వృద్ధి
Send us your feedback to audioarticles@vaarta.com
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి మార్చి త్రైమాసికం సహా (జనవరి–మార్చి) 2018–19 ఆర్థిక సంవత్సరం గణాంకాలు శుక్రవారం వెలువడ్డాయి. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణం చేసిన అనంతరం కేంద్రంలో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. శుక్రవారం సాయంత్రం రోజున కేంద్ర గణాంకాల కార్యాలయం ఈ గణాంకాలను విడుదల చేసింది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం కంటే తక్కువగా 6.8 శాతంగా ఉందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వ్యవసాయ, ఉత్పాదక రంగాల్లో పేలవమైన పనితీరు కారణంగా భారత ఆర్థిక వృద్ధిరేటు జనవరి-మార్చి నెలలో 5.8 శాతానికి తగ్గింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం కంటే తక్కువగా 6.8 శాతంగా ఉందని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వెల్లడించింది.
2014-15 నుండి స్థూల దేశీయోత్పత్తి వృద్ధి నెమ్మదిగా ఉంది. 2013-14లో మునుపటి కనిష్ట శాతం 6.4 శాతంగా ఉంది. నాలుగో త్రైమాసికంలో చైనా 6.4 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే 2019–20లో 7.1 శాతం, 2020–2021లో 7.2 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలో తేలిందని ఫిక్కీ వివరించింది. 2019–20లో వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7.3 శాతం వరకూ ఉంటుందని సర్వే పేర్కొన్నట్లు తెలిపింది. అంతటితో ఆగని ఫిక్కీ మరింత మెరుగుపడాలంటే ఏమేం చేయాలో కూడా వెల్లడించింది. సకాలంలో రుణ లభ్యత, జీఎస్టీ రిఫండ్స్ జరగాలని, ఎగుమతి సంబంధిత మౌలిక రంగం మరింత మెరుగుపడాలని ఆయా అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయనీ అభిప్రాయపడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com