దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ కూడా...

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలు దాటేశాయి. వరుసగా ఐదు రోజులుగా దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటుతున్న విషయం తెలిసిందే. నేడు కూడా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. సోమవారం కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696కు చేరుకుంది.

గడచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనా కారణంగా 771 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 38,136 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులున్నాయి. 11,86,203 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ దేశంలో 2,02,02,858 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ రాజకీయ నేతలు కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం..

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయించారు. నేడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.

బ్రేకింగ్: అమిత్ షాకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణ నేతలతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోడంతో..

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నేడు దాదాపు 55 వేల కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఐదు రోజులుగా 50 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.